శేరిలింగంపల్లి, జనవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం ఆది ఆధ్వర్యంలో పేరిట 21 కిలో మీటర్ , 10 కిలో మీటర్, 5 కిలో మీటర్ విభాగాలలో దాదాపు 4000 మంది ఔత్సహిక రన్నర్స్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 26 వ తేదీన రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని, ప్రజలలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఈవెంట్ లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి రన్నర్ కి టీ షర్ట్, మెడల్, సర్టిఫికెట్ అందించారు. అలాగే ప్రతి విభాగంలో మొదటి ఇద్దరి విజేతలకు కాష్ ప్రైజ్, ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ కంపెనీలూ గ్లోబస్ డెవలపర్స్, యూల గ్రూప్, ఓఘా హెల్త్, పి ఆర్ కె హాస్పిటల్స్ తదితర సంస్థలు సహకారం అందించాయి.

తెలంగాణ హాఫ్ మారథాన్ ఈవెంట్ లో అన్ని విభాగాలను పి ఆర్ కె హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పుట్టా రవి కుమార్, ఓఘా హెల్త్ అధినేత డాక్టర్ సంధ్యతో కలిసి గ్లోబల్ ఈవెంట్స్ అధినేత ఆది జెండా ఊపి ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన బ్రాండ్ అంబాసిడర్స్, పలు సంస్థలకు కృతజ్ఞతలు తెలిపి, మెమెంటోలతో సత్కరించారు.
‘





