శేరిలింగంపల్లి, జనవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో చత్తీస్‌గఢ్ గాంధీ శిల్పబజార్ హస్తకళా ఉతసవం సందర్శకులను ఎంతగో ఆకర్షిస్తోంది. బస్తర్ జిల్లా కి చెందిన గోండ్ పెయింటింగ్, మెటల్ క్రాఫ్ట్స్ , వెదురు తో తయారు చేసిన వస్తువులు గురు అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఒడిస్సి, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. సుస్మిత మిశ్ర శిష్య బృందం ఒడిస్సి నృత్య ప్రదర్శనలో శుక్లాం బరధరం, స్థాయి, శ్రీహరిస్తోత్రం, బసంత్ పల్లవి, సంజనిరి, తరంగ్, మొఖ్య అంశాలను దివ్యశ్రీ , ఆర్వీ, సౌమ్య, ఆద్య, సంప్రీతి, అంకిత, తన్వి ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో నిహారిక చౌదరి శిష్య బృందం దంతం భజామి, బ్రహ్మాంజలి, జతిస్వరం, దశావతార శబ్దం, అన్నమాచార్య, శివ తాండవ స్తోత్రం, జావళి, కూచిపూడి తల్లికి వందనం మొదలైన అంశాలను సమన్వి, లాలిత్య, మనస్విని, శ్రీష్టి, శృతి, నిత్య, హిమాన్వి, కైరా, నైనికా ప్రదర్శించి మెప్పించారు.






