శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న మంజీరా మంచి నీటి పైపులైన్ లీక్ అయి నీరు వృథాగా రోడ్డుపై ప్రవహించడాన్ని గమనించిన శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత అధికారులను సంఘటనా స్థలానికి పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంచినీరు వృథా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్య్లుఎస్ ట్రాన్సిమిషన్ డిఏఈ ముస్తఫా ఆలీ, అధికారులు పాల్గొన్నారు.






