శిష్టకరణ సంక్షేమం కోసం కృషి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శిష్టకరణం సంక్షేమ సంఘం అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వార్డు కార్యాలయంలో శిష్టకరణం సంక్షేమ సంఘం క్యాలెండ‌ర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు డి.వి.కృష్ణా రావు మాట్లాడుతూ శిష్టకరణం సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణం సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.విజయకుమార్, ఉపాధ్యక్షుడు ఆర్ శేషగిరిరావు, సంయుక్త కార్యదర్శి నారాయణ రావు, పార్వతీశ్వ‌ర రావు, పి.ఆర్.ప్రకాష్ రావు, ప్రతాప్ రాజ్, వికాష్, హరగోపాల్, పార్థసారథి, గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, సాయి పాల్గొన్నారు.

శిష్టకరణం సంక్షేమ సంఘం నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here