శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్య ఆరాధన సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో వేసవి వెన్నెల ఉచిత అన్నమయ్య కీర్తనల కార్యక్రమం ప్రారంభమయ్యింది. దాదాపు ఐదు సంవత్సరాల నుండి అరవై ఏళ్ల పై వయసు కలిగినవారు సంగీతంపై ఆసక్తి ఉన్న వారు కలిసి వంద మంది శిష్యులుగా అన్నమయ్య కీర్తనలు నేర్చుకునేందుకు హాజరయ్యారు. తొలుత అన్నమ గాయత్రి మంత్రం, హరియవతారమీతడు అన్నమయ్య, దినము ద్వాదశి నేడు అన్న సంకీర్తనలు, వాటితో పాటు సంకీర్తనల భావం కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో శోభారాజు విశ్లేషించారు. ప్రతి రోజూ శిబిరం చివరన అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగుస్తోంది.