చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ 23.03.2025 ఆదివారం ఉదయం 11 :00 గంటలకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి రూ.2 కోట్ల 23 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణము పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయ‌నున్నార‌ని కార్పొరేట‌ర్ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్, KSR ఎనక్లేవ్ కాలనీ లలో రూ.1 ఒక కోటి.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు, వేముకుంట, సత్య ఎనక్లేవ్ కాలనీలలో రూ. 98.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాప‌న‌లు చేస్తార‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here