విడ‌త‌ల వారిగా బ‌స్తీలు, కాల‌నీల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మొగులమ్మ బస్తి కాలనీలో రూ.35.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, త‌మ‌ కార్పొరేటర్లు, త‌న‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకొని ప్రత్యేక చొరవతో మొగులమ్మ బస్తి కాలనీలో శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతాలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నాగప్రియ, మేనేజర్ ఝాన్సీ, నాయకులు కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here