శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి ఒక్కరికి విద్య చాలా అవసరమని, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి సందయ్య మెమోరియల్ ట్రస్ట్, RKY ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాయని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి, ట్రస్ట్ సెక్రటరీ, ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ అన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్, RKY ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి జెడ్పీహెచ్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఆలిన్ వన్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని, అన్ని రంగాల్లో రాణించి అత్యున్నత స్థాయిలో నిలవాలని అన్నారు. ఈ స్టడీ మెటీరియల్ ను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా తయారు చేయించామని, విద్యార్థులు సద్వినియోగపరచుకుని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రామిరెడ్డి, ఉపాధ్యాయులు మహేష్ గౌడ్, ఆంజనేయులు సాగర్, రవి నాయక్, భాస్కర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సాయికుమార్ పటేల్, సంతోష్, మన్యం కొండ సాగర్, అశోక్, మల్లేష్, వెంకటేష్, ఆత్మారామ్, మోహిత్, రాము, షణ్ముఖ్ , నాగులు పాల్గొన్నారు.






