శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలను అనుసరించి వాహనాలను నడపాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు. బాచుపల్లి నుంచి మియాపూర్ జంక్షన్ వరకు ఉన్న రహదారిపై ఫ్రీ లెఫ్ట్ ట్రాఫిక్‌ను నిరోధిస్తున్న వాహనదారులపై ఆయన కొరడా ఝులిపించారు. ఈ మేరకు ఆయన హెచ్‌జీ వీరేశంతో కలిసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తున్న వాహనదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని, ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని బ్లాక్ చేయకూడదని, వెనుక నుంచి వస్తూ ఎడమ వైపు తిరిగి వెళ్లే వాహనాలకు దారి ఇవ్వాలని ఆయన అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సహకరించాలని సూచించారు.






