శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): TRP రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ సూచన మేరకు బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) తరఫున రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుల్ల వాసుకి రాజేంద్రనగర్ RDO, MRO కార్యాలయంలో, గండిపేట్ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలను సమర్పించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, సంక్షేమ నిధులు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా బీసీ సబ్ ప్లాన్ అమలుకు సంబంధించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని TRP నాయకులు పేర్కొన్నారు.






