బీపీ మండల్ 40 సిఫారసుల‌ అమలుకు పోరాటం: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పల్లె పల్లెకు బీసీ వాదం, బీపీ మండల్ 40 సిఫారసుల‌ అమలుకు పోరాటం అనే నినాదంతో పోరాటం చేయాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పార్లమెంట్లో ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టాల‌ని, రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమ‌లుకు రాజ్యాంగ సవరణకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. బీసీ సామాజిక చట్టంను వెంటనే అమలు చేయాల‌ని, కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని, బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను సాధించుకునేందుకు ప్రతి గ్రామంలో బీసీలు సంఘటితం అవ్వాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here