చ‌లివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని దీప్తి హిల్స్ లో మాదాపూర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నందు డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చడం అద్భుత‌మైన సేవా కార్య‌క్ర‌మ‌మని కొనియాడారు. ఇలాంటి సేవ‌ల‌ను అందించేందుకు దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హ‌కారం అందించాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజద్, వెంకటేష్, పాస్టర్లు ఎడ్విన్, రాజు, డేవిడ్, సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here