యాదవుల అభివృద్ధికి కృషి చేయాలి.. యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్‌కు ఘన సన్మానం..

శేరిలింగంపల్లి, మే 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్‌కు ఉమ్మడి నల్గొండ జిల్లా యాదవ మహాసభ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదవ సమాజానికి చెందిన పేద కుటుంబాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయని, యాదవ కార్పొరేషన్ ద్వారా వారికి అండగా నిలిచి సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించాలని రఘునాథ్ యాదవ్‌ను కోరారు. సమాజ సేవను ప్రధాన లక్ష్యంగా తీసుకొని బీసీలకు, సామాన్య ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, సందీప్ యాదవ్, నవీన్ యాదవ్, రాజు గౌడ్, రాజు యాదవ్, సాయి, గౌస్, వెంకట్, చింటూ సందీప్, పరమేష్, గణేష్ యాదవ్, సాయి యాదవ్, మల్లయ్య యాదవ్, భాస్కర్ యాదవ్, శశి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here