- కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధికి పాటు పడుతున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ప్రశాంత్ నగర్ లో ఇంటింటికి మంజీరా మంచినీటి సరఫరా ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. కాలనీలో ఇప్పటివరకు ఉన్న పాత పైపులైన్ వల్ల సరఫరా అయ్యే నీరు సరిపోకపోవడంతో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కొత్త పైపులైన్ పనులు వేయించి ఇంటింటికీ మంచినీటి సరఫరాను అందజేయడం జరుగుతుందని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.
యూజీడీ, సీసీ రోడ్లను వేయించాలని స్థానికులు కోరగా బాక్స్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కార్పొరేటర్ చెప్పారు. కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదని రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలన్నింటిని దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లు నెలకొన్న నీటి సమస్యను చెప్పగానే స్పందించి నీటి సరఫరాకు కృషి చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట దాసోజు శ్రీనివాస్, సూర్యకాంత్ పాటిల్, బహదూర్ ఖాన్, అహ్మద్ ఖాన్, ఫతేఖాన్, బ్రహ్మచారి, విజయ్ కుమార్, సంజయ్ తో పాటు గోపీనగర్ టీఆర్ఎస్ పార్టీ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్, యువజన నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు.