- కార్పొరేటర్ మినహా ఏడుగురు ఆశావహుల మధ్య సయోధ్య
- ఎవరికి అవకాశం ఇచ్చిన కలిసి పనిచేయాలని ఒప్పందం
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ శేరిలింగంపల్లిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు సిట్టింగ్‌లకే తిరిగి టిక్కెట్లు ఖరారయ్యాయని చర్చ జరుగుతుండగా మరోవైపు ఆశావహుల మధ్య పోటి సైతం అంతకంతకు పెరుగుతుంది. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే వాతవరణం నెలకొనగా ఆశవహుల్లో టెన్సన్ మొదలయ్యింది. ఐతే చందానగర్ డివిజన్ ఆశావహుల్లో మాత్రం వింత పోకడ కనిపిస్తుంది. మిగిలిన చోట్ల మాకంటే మాకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ వస్తుంటే ఇక్కడ టిక్కెట్ అశిస్తున్న నాయకులు మాత్రం సిట్టింగ్‌కు కాదని తమలో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇస్తే కలిసి పనిచేసుకుంటామని అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక క్రిస్టల్ గార్డెన్స్‌లో కార్పొరేటర్ టిక్కెట్ ఆశిస్తున్న నేతలు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టిక్కెట్ సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటివరకు చందానగర్ డివిజన్ నుంచి దాదాపు 15 మంది నేతలు టిక్కెట్ ఆశించిన విషయం విదితమే. ఐతే ఈ సమావేశంలో అనేక అంశాలపై సమాలోచనలు చేసిన నేతలు అందరి ఆమోదంతో ఆశావహుల సంఖ్యను ఏడుగురికి కుదించుకున్నట్టు తెలుస్తుంది. డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి, గతంలో కార్పొరేటర్‌గా పోటి చేసి ఓడిపోయిన ఉరిటి వెంకట్రావు, మాజీ కౌన్సిలర్లు సునితా ప్రభాకర్ రెడ్డి, కట్ల రఘుపతిరెడ్డి, సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, గుడ్ల ధనలక్ష్మి, జెరిపెటి రాంచందర్ రాజులు ఫైనల్ గా బరిలో నిలువాలని తీర్మాణించుకున్నట్టు సమాచారం. ఈ ఏడుగురిలో ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా మిగిలిన వారందరు కలసి పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకునట్టు సమాచారం. ఐతే వీరిని కాదని అధిష్టానం సిట్టింగ్ కార్పొరేటర్‌కే అవకాశం కల్పిస్తే ఏలా స్పందించాలనే అంశంపై మాత్రం స్పష్టత రాలేనట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ అశోక్‌గౌడ్, సీనియర్ నాయకులు జనార్ధన్‌రెడ్డి, సుప్రజ ప్రవీణ్, దాసరి గోపి కృష్ణ, అక్భర్ ఖాన్, మిరియాల ప్రీతమ్, గురుచరణ్ దూబే, రవిందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

నా పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: నవత రెడ్డి
స్థానిక సిట్టింగ్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డిని నమస్త శేరిలింగంపల్లి కదిలించగా కోట్లాది రూపాయలతో డివిజన్‌ను అభివృద్ధి చేశామని, కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోని సంక్షేమ సంఘాలు, ప్రజలు తమ పనితీరు పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ బేదాలు సహజమని, తమతో పాటు టిక్కెట్ కోసం ఎవరైనా పోటిపడొచ్చని అన్నారు. ఐతే ఇప్పటికే టిక్కెట్ విషయంలో అధిష్టానం ఒక అంచనాకు వచ్చిందని, అటు కేటీఆర్ ఇటు ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపి రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావులపై తమకు పూర్తి విశ్వాసముందని, అభ్యర్థుల జాబితాలో తమ పేరు మొదటి వరుసలోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఏలాంటి నిర్ణయం తీసుకున్న వారి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని అన్నారు.






Eka thati ga velethe kukkalu chinchina vistari la maruthundhi .. mundhu mundhu