శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామ నవమి పర్వదినంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానములో జరిగిన శ్రీ సీతారాముల పట్టాభిషేకం మహోత్సవం కార్యక్రమంలో బాగంగా జరిగిన రథయాత్ర కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నాయినేనీ చంద్రకాంత్ రావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం తదనంతరం జరిగే సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం తదనంతరం నిర్వహించిన రథయాత్ర ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా సప్తగిరి, వివేకానంద నగర్ కాలనీలలో పురవీధులలో ఘనంగా ఉరేగింపు చేయడం జరిగిందని, అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ప్రజల మధ్య ఎంతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కొనసాగిందని, ఆధ్యాత్మికత వెల్లివిరిసిందని, పుర వీధులలో రామ నామాలతో జై శ్రీరామ్ అని మార్మోగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ శర్మ, నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, దేవి నేనీ ప్రసాద్, చంద్రశేఖర్ హర్ష, ప్రదీప్, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.