శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు నూతనంగా నిర్మాణం చేపట్టిన వరద నీటి కాల్వ నిర్మాణ పనులను పరిసర ప్రాంత కాలనీల వారి విజ్ఞప్తి మేరకు మార్పు చేర్పుల కోసం SNDP అధికారులు, కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ గురునాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు నూతనంగా నిర్మాణం చేపట్టిన వరద నీటి కాల్వ నిర్మాణ పనులను, పరిసర ప్రాంత కాలనీల వారి విజ్ఞప్తి మేరకు మార్పు చేర్పుకు SNDP అధికారులు, కాలనీ వాసులతో కలసి పరిశీలించి, సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, వీడియ కాలనీ ఎఫ్సిఐ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు వరద నీటి కాలువ నిర్మాణ పనులలో కొన్ని మార్పు చేర్పులను చేసే విధంగా సంబంధిత అధికారులు కాలనీవాసులతో కలసి చర్చించడం జరిగిందని, ఈ సమస్యను PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యపై చర్చించి త్వరలోనే పనులను పున ప్రారంభించి పూర్తిచేసి కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రీకాంత్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు ఉమాకిషన్, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, కప్పెర రమేష్, కాలనీ వాసులు రవీందర్ రెడ్డి, జగన్, ఎం వి రావు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.