శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ లో ట్రాఫిక్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సింహాచలం అనే వ్యక్తి మృతి చెందడం అత్యంత బాధకరమైన విషయం అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మియపూర్ మెట్రో స్టేషన్ 600 పిల్లర్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులను కూకట్ పల్లి నుండి మియపూర్ వైపు వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొందని, అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సింహాచలం మృతి చెందడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేస్తున్నాని అన్నారు. అలాగే గాయాల బారిన పడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు వికేందర్, రాజవర్ధన్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.