శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.






