శేరిలింగంపల్లి, అక్టోబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మొంథా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సూచించారు.మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని , వర్షాల వల్ల ఎటువంటి సమస్యలు ఎదురైన తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు అప్రమత్తంగా ఉండలని, మొంథా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు, ప్రతి కాలనీ వాసులు తమ ఇండ్ల నుంచి ఎవరు బయటకి రావొద్దు అని అన్నారు. అత్యవసరం తప్పితే ఎవరు బయటకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని , ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంబంధిత అధికారులకు గాని, తమకు గాని, తమ కార్యాలయంను గాని సంప్రదించాలని అన్నారు.

కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని , GHMC అధికారులు , హైడ్రా సిబ్బంది, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని , ప్రజలు అభద్రతకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు.





