శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరామ నవమిని పురస్కరించుకుని లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన ఏక బిల్వం పత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ గణపతి ఫౌండర్ రమణ మూర్తి, లక్ష్మీ గణపతి ప్రధాన అర్చకుడు మురళి, కాలనీ సెక్రటరీ జయ కుమార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు, సాయి కీర్తి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ శేషగిరి పాల్గొన్నారు.






