శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): గొట్టిముక్కల జశ్వంత్ రావు (దేశాల్) జన్మదినం సందర్బంగా దేశాల్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన వేడుకల్లో సూర్య ఉదయం తెలంగాణ ఎడిటర్ బాషా, స్థానిక విలేకరులతో కలిసి ఆయనను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేశాల్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా సేవలో ముందుంటూ రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేశాల్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వ్యక్తిగతంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన బాషా, స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో విలేకరులు శ్యామ్ సుందర్, షబ్బీర్, క్రాంతి కుమార్, సోమి రెడ్డి, సునీల్ జ్యూమర్ తదితరులు పాల్గొన్నారు.






