శివోత్స‌వాల‌లో శ్రీ భ‌వానీ మాత‌కు విశేష పంచామృతాభిషేకం

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌ందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవానీ శంకరాల‌య‌ 21 వ వార్షిక శివోత్స‌వములు మూడ‌వ‌ రోజు ఘ‌నంగా కొన‌సాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సుద‌ర్శ‌నం సత్యసాయి అచార్యులు, శైవ ఆగమ వేద పండితులు సుబ్రహ్మణ్యం శర్మ బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బుద‌వారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప్ర‌ధానంగా శ్రీ భవానీ అమ్మ వారికి విశేష‌ పంచామృత అభిషేకం, విశేష పుష్పాలంకారం, మహిళా భక్తులచే లక్ష కుంకుమార్చన వైభ‌వంగా జ‌రిగింది. సాయంత్రం రావ‌ణ‌‌వాహ‌న సేవ‌లో భాగంగా చందాన‌గ‌ర్ పుర‌వీధుల్లో శ్రీ భ‌వానీ శంకరులు ఊరేగారు. దారిపొడ‌వునా భ‌క్తులు స్వాగ‌తం ప‌లుకుతు స్వామివార్ల‌‌ను ద‌ర్శించుకున్నారు.

వివిధ పండ్ల ర‌సాల‌తో శ్రీ భ‌వానీ మాత‌కు అభిషేకం చేస్తున్న ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ సుద‌ర్శ‌నం స‌త్య‌సాయి
రావ‌ణ వాహ‌నంపై ఊరేగుతున్న శ్రీ భ‌వానీ శంక‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here