ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచిన శేరిలింగంప‌ల్లి టీఆర్ఎస్ శ్రేణులు

  • శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో ప్ర‌భుత్వ విప్ గాంధీ ప్ర‌త్యేక స‌మావేశం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఉమ్మ‌డి రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో శేరిలింగంప‌ల్లి టీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌చారంలో వేగం పెంచారు. శేరిలింగంపల్లి డివిజన్ తెరాస పార్టీ కార్యకర్తలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ప్రచారం ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలపై గాంధీ శ్రేణుల‌కు సలహాలు, సూచనలు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ రాగం సుజాత యాదవ్, యువ‌జ‌న‌ నాయకులు రాగం అనిరుద్ యాదవ్, పార్టీ కాలనీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ వార్డు ఇంచార్జిలు పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ స‌మావేశంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, రాగం సుజాతా యాద‌వ్‌

మియాపూర్ డివిజ‌న్‌లో…
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతుగా మియపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో స్థానిక కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌ ప్రచారం నిర్వహించారు. ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించి ఓటు వేయాల‌ని కోరారు. మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు కూత‌రు విద్యావంతురాలైన వాణీదేవికి మ‌ద్ద‌తు తెల‌పాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు ఉమాకిషన్, సుప్రజా,  మధుసూదన్ రెడ్డి,సాబేర్  మరియు కాలనీ వాసుసులు తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ ఎఫ్‌సీఐ కాల‌నీలో ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఓట్లు అడుగుతున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌

గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో…
గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఉమ్మ‌డి రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో భాగంగా స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. డివిజ‌న్‌ మాజి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా గారి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో డివిజన్‌లో ఏరియాల వారిగా ఇంచార్జ్ లను నియమించి, వారికీ ఓటర్ లిస్టు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా ఇంచార్జీల‌కు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో వార్డు, ఏరియా కమిటి మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

గ‌చ్చిబౌలి డివిజ‌న్ స‌న్నాహ‌క స‌మావేశంలో నాయ‌కులకు సూచ‌న‌లు చేస్తున్న మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here