నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ రామ్ నరేష్ నగర్‌లోని శివ మాలధారణ భక్తుల సన్నిదానంను బిజెపి శేరిలింగంపల్లి నాయకులు రవి కుమార్ యాదవ్ బుదవారం సందర్శించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో శివభక్తులు మాలలు ధరించి భక్తి శ్రద్ధతో పూజలు చేయడం సంతోషకరమని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని శివుడిని ప్రార్ధించినట్టు రవికుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదర్‌నగర్ డివిజన్ బిజెపి నాయకుడు బొల్లెపల్లి సీతారామరాజు, బిక్షపతి, బాలయ్య, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.