శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ D. శశి రేఖ తెలిపారు. అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 10 నుండి 16 వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ప్రతి రోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు చందానగర్ కార్యాలయంలో అప్లికేషన్లను స్వీకరిండం జరుగుతుందన్నారు.






