శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబిర్ చెరువు సుందరీకరణ పనులను PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాందీ మాట్లాడుతూ అంబిర్ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు తుది దశలో ఉన్నాయని అన్నారు. అంబిర్ చెరువు సుందరీకరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, చెరువు చుట్టుపక్కల ప్రజల విజ్ఞప్తి మేరకు గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందని, గుర్రపు డెక్క తొలగింపు పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. గుర్రపు డెక్క తొలగింపు ద్వారా దోమల బెడద తగ్గుతుందని తెలిపారు. చెరువు సుందరీకరణలో భాగంగా చెరువు కట్టను పటిష్ట పరిచేలా పునరుద్ధరణ, మురుగు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం , పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
