శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి NH65 శ్రీదేవి థియేటర్ రోడ్డు నుండి అమీన్ పూర్ వరకు రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే 2.7 KM పొడవు ఉన్న 4 లేన్ రహదారి విస్తరణ, 2 లేన్ సర్వీస్ రహదారి విస్తరణ పనులను ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు , ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రహదారి విస్తరణ పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పనులలో వేగం పెంచాలని, పనులలో అలసత్వం ప్రదర్శించకూడదని, త్వరితగతిన రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్ట్స్ అధికారులు EE నామ్యా, DE హరీష్ బాబు, AE శివ కృష్ణ యాదవ్, AE సౌమ్య, టౌన్ ప్లానింగ్ TPS రోహన్, ఎలక్ట్రికల్ AE శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రఘునాథ్ రెడ్డి, MD ఇబ్రహీం, పోచయ్య, ఎల్లమయ్య , శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.





