ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదులో వేగం పెంచాలి

  • కార్పొరేట‌ర్లు, తెరాస నాయ‌కుల‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు స‌మావేశం

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని త‌న‌ క్యాంప్ కార్యాలయంలో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావులు సోమ‌వారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు హమీద్ పటేల్, సాయిబాబా, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, జానకి రామ రాజు, లక్ష్మీ బాయి, నవత రెడ్డి, పూజిత, సింధు ఆదర్శ్ రెడ్డి, తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ న‌వీన్ రావు పాల్గొని మాట్లాడుతూ రాబోయే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని, ఓటర్ నమోదు ప్రక్రియను వేంగవంతం చేయాలని అన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెరాస పార్టీ‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో మంత్రి కేటీఆర్ ఓటరు నమోదు విషయమై దిశా నిర్దేశం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదునకు ప్రాధాన్యత ఇవ్వాలని , ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ తమ ఓట్లను, తమ కుటుంబ సభ్యుల ఓటర్లను నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి కార్యకర్త అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని ఓటరుగా నమోదు చేయించుకోవాల‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని, పాత ఓటు హక్కు కలిగిన వారు కూడా మళ్ళీ ఓటు నమోదు చేసుకోవాలని తెలియజేశారు.

2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ / ఇంజనీరింగ్ / ఇతర డిగ్రీలలో ఉత్తీర్ణులైన వారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లుగా నమోదు చేయించుకోవడానికి అర్హుల‌ని, ఆధార్ కార్డు జిరాక్స్, ఓటర్ ఐడీ కార్డు జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, మొబైల్ నెంబర్ (ఓటీపీ కోసం)ల‌తో ఫాం నం.18ను నింపి ఇవ్వాల‌ని అన్నారు.

పాల్గొన్న కార్పొరేట‌ర్లు, తెరాస నాయ‌కులు

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్‌, మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు రంగారావు, రవి ముదిరాజు, వివేకానంద నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస్, మాదాపూర్ డివిజన్ అధ్య‌క్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హ‌ఫీజ్‌పేట్ డివిజన్ అధక్షుడు గౌతమ్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు, వాలా హరీష్, నాయినేని చంద్రకాంత్ రావు, లక్ష్మా రెడ్డి, ఉరిటి వెంకట్ రావు, జెరిపాటి రాజు, కోనేరు ప్రసాద్, సత్యనారాయణ, సాంబ‌శివరావు, చింత కింది రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here