శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ చాంద్ పాషాను ఆర్యవైశ్య సంఘం కొండాపూర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం, డివిజన్ అభివృద్ధి, సమాజ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే ఆరెపూడి గాంధీ నాయకత్వంలో కలిసి పనిచేస్తామని సంఘం నాయకులు తెలిపారు. ఈ భేటీలో ఆర్యవైశ్య సంఘం (AVS) కొండాపూర్ ప్రస్తుత అధ్యక్షుడు ఉప్పుగండ్ల ఆనంద్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు కామిశెట్టి జగదీశ్వర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి గంప సంతోష్ గుప్తా, ఉపాధ్యక్షుడు మాగులూరి సత్య ప్రసాద్ గుప్తా పాల్గొన్నారు.






