శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్ప, పరిసర ప్రాంతలలో AMHO డాక్టర్ శ్రీకాంత్, జిహెచ్ఎంసీ వివిధ శాఖల అధికారులతో కలిసి తెల్లవారుజామున ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లోని చెత్తను, మురుగు కాలువలను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆకతాయిలు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దోమలు విజృంభించకుండా, కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవ్ లో భాగంగా స్థానిక ప్రజలకు అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలని కార్పొరేటర్ సూచించారు. ప్రజలందరూ పరిశుభ్రత బృందాలకు సహకరించాలని, పబ్లిక్ ప్రదేశాల్లో వ్యర్ధాలను వేయవద్దని, పరిశుభ్రమైన వాతావరణం వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్థానిక ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో AMHO డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపి వెంకట్ రమణ, జిహెచ్ఎంసీ కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీకాంత్, ఎంటమాలజీ ఏఈ తనూజ, సీనియర్ నాయకుడు కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, పురం విష్ణువర్ధన్ రెడ్డి, సౌజన్య, సారయ్య గౌడ్, శానిటేషన్ స్టాఫ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.





