ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లింగంపల్లి విలేజ్ కమ్యూనిటీ భవనం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలేజ్, వెంకట్ రెడ్డి కాలనీలో పలు సమస్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మాణ పనులు చేపడుతున్న కమ్యూనిటీ భవనంను త్వరలోనే పూర్తిచేయిస్తానని, స్థానికవాసులు రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ఒకే తాటిపై ఉండి కమ్యూనిటీ భవనంలో ఏవైనా అధికారిక సమావేశాలు, విలేజ్ అభివృద్ధికి సంబంధిత సమావేశాలు ఇతర కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించుకునేలా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, కృష్ణ యాదవ్, సోమయ్య, జనరల్ సెక్రటరీ దేవులపల్లి శ్రీనివాస్, రాజా రెడ్డి, వెంకటేశ్వర్లు, పాశం బాలరాజ్, పాశం రాజు, బ్యాగరి రాజు, వి రాజు యాదవ్, శశి కిరణ్, నిజాం, సురేష్ రాథోడ్, సయ్యద్ గఫుర్, కిషోర్ యాదవ్, కిరణ్ యాదవ్, రవి, పిల్లి అనిల్, భరత్ గౌడ్, ముబీన్, నవీన్ గౌడ్, మల్లేష్, వినయ్, విక్కీ, విజయ్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here