శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో శేరిలింగంపల్లి యువనేత, భారాస సీనియర్ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం ఉదయం ఆయనను కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. రవీందర్ యాదవ్ తో కొద్దిసేపు ముచ్చటించారు. అలాగే రవీందర్ యాదవ్ యోగ, క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏఐ సమ్మిట్ లోనూ పాల్గొనాలని కోరగా, రవీందర్ యాదవ్ ఆయనతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కృష్ణుడి ప్రతిమను అందించారు. శాలువాతో అఖిలేష్ యాదవ్ ను సత్కరించారు. ముఖ్యంగా తెలంగాణలో భారాస అధికారంలోకి రాబోతున్నట్లుగా రవీందర్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కు వివరించినట్లుగా వెల్లడించారు. కేటీఆర్ నాయకత్వంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు కనిపిస్తుందని, కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను గ్రేటర్ ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపిస్తారని స్పష్టం చేశారు. రానుంది భారాస పాలన అని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.






