మంచి ఆరోగ్య సూత్రాల‌ను పాటించాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్న యోగా హాల్ లో జరిగిన సీనియర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్య – కూకట్‌పల్లి చాప్టర్ తెలంగాణ ఆధ్వర్యంలో 80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు సన్మానం కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ వ‌డ్డేపల్లి రాజేశ్వర రావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని సీనియర్ సిటీజన్లను సన్మానించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ 80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్స్ ను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని, ఒకే వేదిక పై ఇంత మందికి సన్మానం చేయడం అరుదైన విషయం అని, నిర్వహకులను ప్రత్యేకంగా అభినదిస్తున్నామ‌ని అన్నారు. మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, మంచి జీవన శైలిని అలవర్చుకోవాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, సంజీవ రెడ్డి, చంద్రమోహన్ సాగర్, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here