శేరిలింగంపల్లి, మార్చి 23 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయి నగర్, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీ, హెచ్ఏంటి స్వర్ణపురి కాలనీలలో రూ. 1 కోటి 26 లక్షల 80 వేల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా మందుకు సాగుతున్నామని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీల వాసులకు ఉపశమనం లభించిందని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.