శేరిలింగంపల్లిలో SIR-2026 గ్రామ సభ.. ఓటర్ల జాబితా సవరణపై చర్చ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో SIR-2026 (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ నాయక్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచనల మేరకు శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్ ఇంచార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, అర్హత కలిగిన కొత్త ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు, వివరాల్లో మార్పులు, సవరణలకు సంబంధించిన అంశాలపై బూత్ లెవెల్ ఇంచార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు చర్చించారు. SIR-2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా బూత్ స్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన కొత్త ఓటర్ల నమోదుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here