నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా రామ కృష్ణ నగర్ లో జరుగుతున్న నాల విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు (వయా జాతీయ రహదారి NH 65 వరకు ) 2.4 కిలోమీటర్ల మేర చేపడుతున్న నాలా విస్తరణ పనులకు రూ.15.88 పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ (SNDP) వ్యూహాత్మక నాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం గా ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాల వరకు రూ.15 కోట్ల 88 లక్షల అంచనా వ్యయం తో 2.4 KM ల మేర పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు తుది దశకు చేరుకున్నాయని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, జంక్షన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. ఎన్నో ఎండ్ల సమస్య నేటితో తీరిపోనున్నదని అన్నారు. నాలాల విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లో అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని గాంధీ పేర్కొన్నారు. అనంతరం రామకృష్ణ నగర్ లో నెలకొన్న డ్రైనేజి, రోడ్డు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురావటంతో సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ లో నెలకొన్న డ్రైనేజి ,రోడ్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపట్టి కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నాల విస్తరణ పనులు పూర్తి కాగానే అవసరమున్న చోట డ్రైనేజి ,మంచి నీటి లైన్ లు ఏర్పాటు చేసిన వెంటనే రోడ్ల ను పునరుద్దరిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, కాలనీ వాసులు పాల్గొన్నారు.






