ఎమ్మెల్యే గాంధీని కలిసిన శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పిఎస్ సి చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ స‌భ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా వారు కాలనీలో ఉన్న సమస్యలను తెలియజేశారు. ఇందుకు గాంధీ సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల శివకుమార్, అసోసియేషన్ సభ్యులు టీవీ రమణ, ప్రసాద్ రావు, డాక్టర్. మల్లేష్, శ్రీనివాస్, పుల్లయ్య, ఈశ్వరయ్య, రంగనాయకులు, రఫీ, రత్నరాజు, రంగారెడ్డి, ధనుజయ్, శ్రీరాంనగర్ యూత్ సభ్యులు కార్తీక్ శ్రీనివాస్, వీరన్న, వెంకటేష్, శివ, నిఖిల్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here