శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ హైటెక్ సిటీలో జీఎస్‌టీని తగ్గిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మోడీ చిత్రపటానికి పాలాభిషేకా కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే ఎన్నో రకాల సంస్కరణలు జరిగాయన్నారు. ఇప్పటినుండి 5 % 18 % రెండు రకాల జీఎస్టీలు మాత్రమే ఉండనున్నాయని, జీఎస్టీ సమావేశం మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందన్నారు. ముఖ్యంగా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లకు ఇంతకుముందు ఉన్న 18% జిఎస్టి ని పూర్తిగా తీసివేశారని, దీని ద్వారా ఎంతో మంది ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లు తీసుకోవడానికి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్, శ్రీనివాస్ రెడ్డి , కృష్ణ గౌడ్ , బాలు నాయక్, మహేందర్, శివ యాదవ్ , నవీన్ రెడ్డి, సాయి, శీను నాయక్ , కిరణ్ రెడ్డి , కురుమయ్య, సుమన్, భారతి, బాలమ్మ, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






