ప్రతి బస్తి, కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌లో రూ 42.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో నాణ్యత‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్, సీనియర్ నాయకులు బబ్లూ సింగ్, గోపాల్, నానక్ రామ్ గూడ‌ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here