కమనీయం “కూచిపూడి నృత్య కదంబ ” 

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం లో శ్రీ కూచిపూడి నృత్య నిలయం, యువ కళావాహిని ఆధ్వర్యంలో  కులపతి మహా గురువు భాగవతుల రామకోటయ్య గారికి  స్మృత్యంజలి సమర్పిస్తూ  భాగవతుల సేతురాం తన శిష్యప్రశిష్యులతో  “కూచిపూడి నృత్య కదంబ ” , సుసర్ల అరుణ కుమారికి భాగవతుల రామకోటయ్య అవార్డు ప్రదానం ఆధ్యాంతం రసరమ్యంగా సాగింది. అడపా భరణి, నళిని రమణ, శ్రీలత, వసంత సంధ్య , క్రాంతి కిరణ్ శిష్యులు వినాయక కౌతం, పుష్పాంజలి, కంజదళాయతాక్షి, సాయిబాబా హారతులు, వాళళుడి ప్రవేశ దరువు, అన్నమాచార్య అకీర్తన, రామదాసు కీర్తన, తరంగం, త్యాగరాజ కృతి మొదలైన అంశాలను రాగిణి, రాజేశ్వరి, హాసిని, రామ హృదయ, సంహిత, రిషిత , అనుశ్రీ, వాగదీశ్వరి, వసంత సంధ్య, సుష్మ ఉదయ్ నర్తించారు. డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ రామ దేవి, డాక్టర్ పద్మజ రెడ్డి, కళాకృష్ణ  గురువర్యులు  విచ్చేసి సుసర్ల అరుణకుమారికి   భాగవతుల కోటయ్య అవార్డు ప్రదానం చేశారు. ప్రదర్శించిన కళాకారులను ఆశీర్వదించారు.

నృత్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here