మదర్ థెరిసా జయంతి సందర్భంగా సేవారత్న అవార్డుల ప్రదానం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తమతమ రంగాల్లో అంకితభావంతో పనిచేసేవారికి ఎప్పుడూ సముచిత గుర్తింపు లభిస్తుందని, అటువంటి వారికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవారత్న పురస్కారాల అందించడం ఎంతో ప్రోత్సాహకరమని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మాదాపూర్ డివిజన్ పరిధిలోని స్వాతి హైస్కూల్ లో కన్వీనర్ తాడిబోయిన యాదవ్ అధ్యక్షతన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వివిధ రంగాలలో విశేషమైన సేవలందించిన అయిదుగురు వ్య‌క్తుల‌కు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, గౌరవ అతిథిగా హాజరైన రాగం మల్లికార్జున యాదవులు సేవారత్న అవార్డులను ప్ర‌దానం చేశారు.

ఎన్.సుజాత, ఎన్. శ్రీకాంత్, రాంమోహన్ (సత్యసాయి సేవా దళ్ సభ్యుడు), డాక్టర్ రఘు అరికపూడి (సామాజికవేత్త), పాటూరి వెంకటేశ్వర్లు (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సామాజిక వేత్త) ఈ పురస్కారాల్ని అందుకున్నారు. ఈ సందర్భంగా దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి చేస్తున్న అనేక సేవాకార్యక్రమాల‌ను అభినందించారు. వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి ఇటువంటి పురస్కారాలను అందించ‌డం వల్ల నిజంగా పని చేసేవారికి ఎంతో ఆత్మతృప్తి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగం మల్లికార్జున యాదవ్, స్వాతి హైస్కూల్ కరస్పాండెంట్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి‌ఫణి కుమార్ ఎం.బసవ లింగం, సత్యసాయి సేవాసమితి సభ్యులు డా.రామన్న, బి.వి.కే.రావు, సుబ్బారావు, మూర్తి, జి.వి.రావు, విష్ణు ప్రసాద్, శివరాం కృష్ణ, పాలం శీను, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here