శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్ లో ఉన్న శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సిలో వినాయకుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్ విద్యార్థి విద్యార్థినిలతో వినాయకుడిని తయారు చేయడం, పెయింటింగ్ వేయడం లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వినాయకుడి విశిష్టతను వివరించారు. ముందు పూజలు అందుకునే గణనాథున్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విఘ్నాలు తొలగి విజయాలు సాధిస్తారని తెలిపారు. వినాయకుని ప్రతిష్టించుకోవడం తర్వాత నీటిలో నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సుధ, అధ్యాపకులు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






