సాయి నగర్ కాలనీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ సాయి నగర్ కాలనీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని, అధికారుల‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవ‌డం లేద‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు, స్థానిక కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణతో క‌లిసి ర‌వికుమార్ యాద‌వ్ కాల‌నీలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ కాల‌నీలో ఎన్నో రోజుల నుండి డ్రైనేజీ పొంగిపొర్లుతుంద‌ని, అధ్వానంగా మారిన శ్మ‌శాన వాటిక వల్ల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు పడుతున్నార‌ని అన్నారు. అలాగే డ్రైనేజీ స‌మ‌స్య అధికం అవ‌డంతో సమస్య రోజురోజుకు తీవ్రంగా మారి దుర్గంధపూరిత‌మైన‌ వాసనతో ప్రజలు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని అన్నారు. వెంట‌నే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ , గోవర్ధన్ రెడ్డి , రంజిత్, శివ యాదవ్, ఆనంద్, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here