సేవా హీ సంఘ‌ట‌న్‌లో 5వ రోజు క‌రోనా వారియ‌ర్స్‌కు సేఫ్టీకిట్‌లు అంద‌జేసిన మూల అనిల్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సేవా హీ సంఘ‌ట‌న్‌లో భాగంగా 5వ రోజు బిజెపి బిజెపి రంగారెడ్డి జిల్లా కార్య‌ద‌ర్శి మూల అనిల్ గౌడ్ ఆద్వ‌ర్యంలో పారిశుధ్య కార్మికుల‌కు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌కు కోవిడ్ సేఫ్టీ కిట్‌ల‌ను అద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పీడ్మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ (నార్త్ కరోలినా యూఎస్ఏ) సహకారంతో నానక్ రామ్ గూడ, ఖాజాగూడాల‌లోని ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు ఫేస్ మాస్కులు, చేతి గ్లాజులు, శానిటైజర్, .విట‌మిన్ ట్యాబ్లెట్‌ల‌తో కూడిన కిట్‌లు అందించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఈ సేవాకార్య‌క్ర‌మాలు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు నక్క శివ కుమార్‌, ర‌ఘు కొవ్వూరి, సతీష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు

పారిశుధ్య కార్మికుల‌కు కోవిడ్ సేఫ్టీ కిట్‌లు అంద‌జేస్తున్న మూల అనిల్ గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here