నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రంగాపురం కాలనీ సమీపంలో పగిలిన మంజీరా పైప్ లైన్ పునరుద్ధరణ పనులను జలమండలి డీజీఎం నాగప్రియతో కలసి స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుక్రవారం పరిశీలించారు. భవిష్యత్తులో మల్లీ లీకేజీలు అవ్వకుండా జాగ్రత్తగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని, సకాలంలో పనులను పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
