నమస్తే శేరిలింగంపల్లి: నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ ఆకలి దినోత్సవాన్ని పురస్కరించుకుని 327 ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వద్ద ఆకలితో అలమటిస్తున్న యాచకులకు శుక్రవారం మధ్యాహ్నం తనతో తెచ్చుకున్న టిఫిన్ బాక్స్‌లోని అన్నంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకవైపు కరోనా విజృంభన, మరోవైపు లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక మంది నిరుపేదలు ఉపాధిలేక అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా జనసంచారం లేక యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనకు తోచిన సహకారం అందించానని తెలిపారు.
