శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని ఓల్డ్ హఫీజ్‌పేట శ్మశాన వాటికలో రూ.98 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను హఫీజ్‌పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పరిశీలించారు. శ్మశాన వాటికలో కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలని, పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను కోరారు.






