నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ఏడీజీపీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ గురువారం కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోజ్ తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీటీసీ యూనిట్ వైద్యులు సుకుమార్, సరిత బృందం పర్యవేక్షణలో కోవాక్జిన్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 94 శాతం మంది సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని అన్నారు. ప్రజలంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం సూచించిన వ్యాక్సినేషన్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశారని, అర్హులైన వారంతా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నుంచి విముక్తి పొందిన వారంతా బాదితులకు ప్లాస్మా డొనేట్ చేసేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. కోవిడ్ వారియర్స్ ప్లాస్మా దానం కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని, ఔత్సాహికులు ఫోన్ నెంబర్ 9490617440లో సంప్రదించాలని సూచించారు.