కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌పై మాదాపూర్ పోలీసుల డిజిట‌ల్ ప్ర‌చారం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా సెంక‌డ్ వేవ్ ఉదృతి కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మాదాపూర్ పోలీసులు విశేష అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. పోలీస్‌స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో డిజిట‌ల్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్ర‌జ‌లు విధిగా ఫేస్‌ మాస్కులు ధ‌రించాల‌ని, త‌ర‌చూ చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని, భౌతిక దూరం పాటించాలంటూ కొనసాగుతున్న డిజిట‌ల్ అడ్వర్టైజ్‌మెంట్ చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్పెక్ట‌ర్ ర‌వీంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల స్వీయ నియంత్ర‌ణ‌తోనే వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌గ‌ల‌మ‌ని, ఈ క్ర‌మంలోనే డిజిటల్ ప్ర‌చారంతో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here